ఇండియా ప్రకటనను సమర్థించిన అమెరికా
- మసూద్, సయీద్, దావూద్, లఖ్వీలను టెర్రరిస్టులుగా ప్రకటించిన భారత్
- ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ప్రకటన
- భారత్ కు అండగా ఉంటామన్న అమెరికా
అజార్, సయీద్, దావూద్, రెహ్మాన్ లను టెర్రరిస్టులుగా భారత్ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. టెర్రరిజాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా భారత్-అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఉపయోగపడుతుందని చెప్పింది.