china: పాకిస్థాన్ అణుకార్యక్రమానికి చైనా సాయం.. రహస్యాన్ని బయటపెట్టిన దోమ!

  • పాకిస్థాన్‌లో డెంగీ బారిన పడిన 200 మంది ఇంజినీర్లు
  • వారంతా పాక్ అణు కేంద్రంలో పనిచేస్తున్న వారే
  • వారిని కుట్టి రహస్యాన్ని బయటపెట్టిన దోమలు

పాకిస్థాన్ అణు కార్యక్రమానికి తాము సాయం అందించడం లేదని చైనా ఎంతగా వాదిస్తున్నా.. అదంతా పచ్చి అబద్ధమని ఓ దోమ చెప్పేసింది. పాక్ అణు కార్యక్రమంలో వందలాది మంది చైనా ఇంజినీర్లు పనిచేస్తున్న విషయాన్ని ఓ చిన్న దోమ బయటపెట్టేసింది. అదెలా అంటే..

చైనాకు చెందిన దాదాపు 200 మంది ఇంజినీర్లు పాకిస్థాన్‌లో డెంగీ బారినపడ్డారు. కరాచీలోని హీకీస్ బేలో ఉన్న అణుశక్తి కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారే వీరంతా. ఇటీవల వీరు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో చాలామంది డెంగీ బారినపడినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో చైనా చిలుక పలుకులపై అనుమానాలు బలపడ్డాయి.

పాక్ అణుకార్యక్రమంలో తమ పాత్ర లేదని ఎంతగా బుకాయిస్తున్నప్పటికీ చైనాకు చెందిన 200 మంది ఇంజినీర్లు డెంగీ బారిన పడడం అనుమానాలు రేకెత్తించింది. 200 మంది అస్వస్థతకు గురయ్యారంటే అసలా కేంద్రంలో ఎంతమంది చైనీయులు పనిచేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఇంజినీర్లను కుట్టిన దోమలు పాకిస్థాన్ అణు కార్యక్రమంలో ఆ దేశం అందిస్తున్న సాయాన్ని ఇలా ప్రపంచానికి చాటిచెప్పాయి.

More Telugu News