తిరుపతి బస్టాండ్ లో... అమ్మాయిని ఎరవేసి నిలువుదోపిడీ!
- రాయచోటి నుంచి వచ్చిన రవి
- యువతి చూసి కక్కుర్తి
- దోచుకెళ్లిన దుండగులు
తన వద్దకు వచ్చి తననే చూస్తున్న ఆమెను చూసిన బాధితుడు, మాటలు కలుపగా, ఆమె అతన్ని పక్కకు తీసుకెళ్లింది. ఈలోగా రవిని చుట్టుముట్టిన ముగ్గురు దుండగులు, రూ. 18 వేల నగదు, స్మార్ట్ ఫోన్, వాచ్, క్రెడిట్ కార్డులు, దుస్తులు ఉన్న బ్యాగ్ లను దోచుకెళ్లారు. దీంతో రవి ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్రయించగా, వారి సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.