విజయవాడలో వైఎస్సార్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన... హాజరైన సీఎం జగన్

  • నేడు వైఎస్సార్ వర్థంతి
  • ఇడుపులపాయలో నివాళులు అర్పించిన జగన్
  • పులివెందుల నుంచి విజయవాడ రాక
విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ పార్కులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన పులివెందుల నుంచి వచ్చారు. ఇవాళ వైఎస్సార్ వర్థంతి కార్యక్రమం కోసం ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, విజయవాడలో వైఎస్సార్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో బొత్స తదితర ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. వర్షం పడుతున్నా వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Go Back to Shorts
YSR
Jagan
Vijayawada
YSRCP

More Telugu News