కశ్మీరీల కోసం తల్వార్ పడతా.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ నోటి దురుసు!
- ఆర్టికల్ 370 రద్దుపై మియాందాద్ ఆగ్రహం
- కశ్మీరీలకు తాను అండగా ఉంటానని వ్యాఖ్య
- సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
పాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మియాందాద్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీ సోదరులారా.. భయపడకండి. నేను మీకు అండగా ఉంటాను. బ్యాట్ పట్టి సిక్స్ కొట్టినవాడిని. తల్వార్ తో మనిషిని చంపలేనా?’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నట్లు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తెను ఈ జావెద్ మియాందాద్ కుమారుడికి 2006లో ఇచ్చి పెళ్లి చేశారు.