ప్రభుత్వ బడుల్లో చేరాలంటే సిఫారసు లేఖలు అడిగే స్థాయికి తెస్తాం: ఆదిమూలపు సురేశ్
- నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి
- విద్యారంగానికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని వెల్లడి
- త్వరలోనే విద్యార్థుల బకాయిలు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో జేఎన్టీయూ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. త్వరలో జేఎన్టీయూ కాలేజ్ కి 80 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని వెల్లడించారు.