'అల వైకుంఠపురములో' ఫస్ట్ లుక్... సూపర్బ్ గా అల్లు అర్జున్!
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన బన్నీ
- స్టూల్ పై స్టయిల్ గా కూర్చున్న అల్లు అర్జున్
- వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల
ఈ పోస్టర్ లో అటు క్లాస్ గా, ఇటు మాస్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ సూపర్భ్ అనిపిస్తున్నాడు. ఓ హై ఎండ్ కారు ముందు స్టూల్ పై, కోటు వేసుకుని కూర్చున్న అల్లు అర్జున్ కు ఓ పోలీసు సిగరెట్ ను వెలిగిస్తున్నట్టు ఇది కనిపిస్తోంది. బన్నీ 19వ చిత్రంగా రానున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తుండగా, హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.