కులం రంగు పులిమి రాజధానిని వేరే చోటకు తరలిస్తామంటే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్
- మంగళగిరిలో జనసేన బహిరంగ సభ
- ఆవేశంతో ప్రసంగించిన పవన్ కల్యాణ్
- పెద్ద ఎత్తున సభకు హాజరైన రాజధాని రైతులు
గత ప్రభుత్వంలో వ్యక్తులు తప్పుచేసి ఉంటే వారిపై విచారణ జరపాలే తప్ప, రాజధాని విషయంలో గందరగోళం సృష్టించే ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రధాని మోదీకి తెలిసే అమరావతి ఏర్పాటైందని, కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం కోసం రూ.1500 కోట్లు ఇచ్చిందని పవన్ గుర్తు చేశారు.