Azam Khan: గేదెను ఎత్తుకెళ్లాడు... సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖాన్ పై దొంగతనం కేసు నమోదు

  • మూడేళ్ల నాటి ఘటన
  • ఎంపీపై ఫిర్యాదు చేసిన రాంపూర్ వాసులు
  • అజమ్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

వివాదాస్పద ఎంపీ, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ పై దొంగతనం కేసు నమోదైంది. ఎంపీ అజమ్ ఖాన్ తమ గేదెను దొంగతనం చేశాడంటూ రాంపూర్ కు చెందిన ఆసిఫ్, జకీర్ అలీ అనే వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. మూడేళ్ల కిందట (2016 అక్టోబరు 15) తమ ఇంటిపై దాడి చేసి గేదెను ఎత్తుకెళ్లారని వారిద్దరూ ఫిర్యాదు చేయగా, పోలీసులు అజమ్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ఇంటి స్థలంపై కన్నేసిన ఎంపీ, అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారంటూ వారిరువురు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, అజమ్ ఖాన్ కు కేసులు కొత్తకాదు. ఇప్పటివరకు ఆయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా పుస్తకాల దొంగతనం, భూ ఆక్రమణలు, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలపై నమోదయ్యాయి.

More Telugu News