Nagarjuna: నాగ్ బర్త్ డే పార్టీలో రూ.2 లక్షల ఖరీదైన డ్రెస్ తో తళుక్కుమన్న సమంత

  • స్పెయిన్ లోని ఇబిజాలో నాగ్ 60వ పుట్టినరోజు వేడుకలు
  • అందరి దృష్టిని ఆకట్టుకున్న సమంత
  • ఎప్పట్లాగానే యంగ్ లుక్ తో నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుక నిర్వహించారు. నాగ్ తన 60వ జన్మదినోత్సవాన్ని ఈసారి స్పెయిన్ లోని ఇబిజా ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో నాగ్ కోడలు సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం ఆమె ధరించిన పింక్ కలర్ డ్రెస్సే. సింగిల్ షోల్డర్ డ్రెస్ లో సమంత హొయలు పోయింది. ఈ అల్ట్రామోడ్రన్ డిజైనర్ డ్రెస్ ఖరీదు రూ.2 లక్షలు! ఇక, నాగ్ ఎప్పట్లానే యంగ్ లుక్ తో మరోసారి అలరించారు. ఆయన 60వ పడిలో ప్రవేశించారంటే నమ్మశక్యం కాని రీతిలో ఫొటోల్లో దర్శనమిచ్చారు.

More Telugu News