ఒకే బ్యాంకుగా ఏర్పడనున్న ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూబీఐ: నిర్మలా సీతారామన్ వెల్లడి
- దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకు ఏర్పడుతుందన్న కేంద్ర ఆర్థికమంత్రి
- పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు కూడా విలీనం అవుతాయని వెల్లడి
- దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు ఏర్పడుతుందని వివరణ
ఇక, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా ఏర్పడబోతోందని మంత్రి వెల్లడించారు. పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు ఒకటిగా విలీనం అవుతున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడే బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇవేకాకుండా సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంకు కలిసిపోతుందని, అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం అవుతుందని వివరించారు. తాజా విలీనాల కారణంగా ప్రస్తుతం ఉన్న 27 బ్యాంకుల స్థానంలో ఇకపై 12 బ్యాంకులు మాత్రమే ఉంటాయని తెలిపారు.