Handrineeva: ‘హంద్రీనీవా’ సామర్థ్యం పెంచాలని సీఎం జగన్ కు పయ్యావుల వినతి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. మొత్తం 14 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్నాలుగు ప్రాజెక్టుల్లో ‘హంద్రీనీవా’ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ‘హంద్రీనీవా’ పేరు ఉంచడం అభినందనీయమని ప్రశంసిస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని కోరారు. ఈ కాలువ వెడల్పు పనులను గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని, మిగిలిన 30 శాతం పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు.
Go Back to Shorts
Handrineeva
cm
jagan
Telugudesam
Payyavula Keshav

More Telugu News