నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన పవన్ కల్యాణ్
- రాజధానిపై అనిశ్చితి
- రైతుల ఆందోళన నేపథ్యంలో అమరావతిలో పవన్ పర్యటన
- పలు గ్రామాల సందర్శన
నిడమర్రు తర్వాత ఆయన కురగల్లు, ఐనవోలు ప్రాంతాల మీదుగా ఎన్ జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లను, హైకోర్టు నిర్మాణాలను పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్లు, ఏపీ సచివాలయం, సీఆర్ డీఏ భవనాలు, జడ్జిలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు తదితర ప్రాంతాల్లోనూ పవన్ పర్యటన సాగనుంది. చివరగా కొండవీడు ఎత్తిపోతల పథకం సందర్శనతో తన పర్యటన ముగించనున్నారు.