PV Sindhu: అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ ఫీజు!

షార్ట్స్‌లో చూడండి
పీవీ సింధు బ్రాండ్ ఫీజు అమాంతం పెరగనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న సింధుకు దేశం మొత్తం జేజేలు పలుకుతోంది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న సింధు బ్రాండ్ ఫీజు రెండింతలయ్యే అవకాశం ఉందని ఆమె మేనేజర్, బేస్‌లైన్ వెంచర్స్ ఎండీ తుషిన్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం సింధు బ్రాండ్ ఫీజు రూ.1 నుంచి 1.5 కోట్లుగా ఉండగా, ఇప్పుడది రూ.3 కోట్లకు పెరిగే అవకాశం ఉందని తుషిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం సింధు 14 బ్రాండ్లకు ప్రచారకర్తగా 40 కోట్లు ఆర్జిస్తోంది. టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అత్యధిక బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉన్నాడు. క్రీడాకారుల పరంగా చూస్తే కోహ్లీ తర్వాతి స్థానంలో సింధు ఉంది. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్న సింధు నిన్న హైదరాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
Go Back to Shorts
PV Sindhu
Hyderabad
brand fee
endorsements

More Telugu News