'కాఫీ టుగెదర్'... అధికారులతో సీఎం జగన్ కొత్త కార్యక్రమం!
- ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం
- భూవివాదాలకు సంబంధించిన వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలన్న సీఎం జగన్
- ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ ప్రతిపాదన చేశారంటూ వెల్లడి
'కాఫీ టుగెదర్' కార్యక్రమం ప్రతి మంగళవారం ఉంటుందని, ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని భూవివాదాలకు సంబంధించిన వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. ఆ వివరాలను రెవెన్యూ అధికారులకు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూవివాదాల కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ చేసిన ఈ ప్రతిపాదన తనకు కూడా నచ్చిందని అందుకే ప్రతివారం సమావేశం నిర్వహిస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని సీఎం జగన్ వివరించారు.