సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించిన ప్రధాని మోదీ

  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ నెగ్గిన సింధు
  • అభినందించిన ప్రధాని మోదీ
  • సంబంధిత ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన వైనం
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధును ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. ఈ ఉదయం సింధు ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమె సాధించిన పసిడి పతకాన్ని సింధు మెడలో వేసి ప్రధాని సత్కరించారు. దేశం గర్వించేలా చేసిన సింధును కలవడం ఆనందంగా ఉందని, ఆమె ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా తీసిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రధాని పోస్టు చేశారు. కాగా, మోదీని కలిసిన సమయంలో సింధు వెంట ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. అంతకుముందు ఆమె కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును కూడా మర్యాదపూర్వకంగా కలిసింది..
Go Back to Shorts
PV Sindhu
Narendra Modi
BWF

More Telugu News