'బుల్లెట్' శ్రేణిలో కొత్త బండి వచ్చింది!

  • మార్కెట్లోకి 'బుల్లెట్ 350 కేఎస్'  
  • ధర రూ.1.12 లక్షలు
  • ప్రారంభమైన బుకింగ్స్
ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా ఉండే మోటార్ సైకిల్ అంటే 'బుల్లెట్' అనే చెప్పాలి. దశాబ్దాలుగా భారతీయులకు సుపరిచితమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇప్పటికీ అదే ప్రజాదరణతో కొనసాగుతోంది. తాజాగా, 'బుల్లెట్' శ్రేణిలో కొత్త మోటార్ సైకిల్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 'బుల్లెట్ 350 కేఎస్' మోడల్ బండి ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కిక్ స్టార్ట్ వెర్షన్ అని చెప్పాలి. దీంట్లోనే ఎలక్ట్రిక్ స్టార్ట్ (బుల్లెట్ 350 ఈఎస్) మోడల్ మరొకటి ఉంది. కాగా, 'బుల్లెట్ 350 కేఎస్' మోడల్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డీలర్ల వద్ద ముందుగా రూ.5 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.1.12 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఇక ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ.1.27 లక్షలని తెలుస్తోంది.
Go Back to Shorts
Bullet
Royal Enfield

More Telugu News