శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టివేత

  • షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు
  • 26 బంగారు కడ్డీలు స్వాధీనం
  • మార్కెట్లో వాటి విలువ రూ.1.12 కోట్లు ఉంటుందని అంచనా
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. ముఖ్యంగా, గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చే కొందరు ప్రయాణికులు బంగారం అక్రమరవాణాకు పాల్పడడం పరిపాటిగా మారింది. తాజాగా, ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 26 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ విపణిలో రూ.1.12 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చినట్టు గుర్తించారు.
Go Back to Shorts
Shamshabad
Hyderabad
Airport
Gold

More Telugu News