నేనూ గంజాయికి బానిసనే.. చాలా కష్టంమీద బయటపడ్డా!: దర్శకుడు భాగ్యరాజా
- నా అసిస్టెంట్ గంజాయి సిగరెట్ తాగేవాడు
- ఆసక్తి కొద్దీ నేను ఓసారి తాగాను
- చివరికి దారి తప్పుతున్నానని అనిపించింది
అతను తాగుతున్న సిగరెట్ కొస వింతగా మెరుస్తూ కనిపించింది. దీంతో అదేంటని నేను అడిగా. తాను గంజాయిని సిగరెట్ లో పెట్టి తాగుతున్నాననీ, ఇది తాగితే ధైర్యం వస్తుందని చెప్పాడు. దీంతో ఒక్కసారి తాగి చూద్దామని ఆశతో గంజాయి సిగరెట్ కాల్చా. ఆ తర్వాత దానికి బానిసై పోయా. సినీ దర్శకుడిగా మారేందుకు వచ్చి గంజాయికి బానిస కావడంతో తప్పుదోవలో వెళుతున్నానని అనిపించింది. చివరకు అతికష్టం మీద ఆ దురలవాటును వదిలించుకున్నా. యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’ అని భాగ్యరాజా తెలిపారు.