సెల్ ఫోన్ ను మింగేసిన ఖైదీ... రింగ్ టోన్ విని పోలీసుల అవాక్కు!
- న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో ఘటన
- ఫోన్ ను మింగేసిన ఖైదీ
- బయటకు తీయించిన అధికారులు
మరింతగా పరిశీలించేసరికి ఆ ఖైదీ కడుపులో నుంచి ఈ రింగ్ టోన్ వినిపిస్తోందని తెలుసుకుని, అతన్ని ప్రశ్నించారు. తాను అతిచిన్న ఫోన్ ను మింగేశానని చెప్పగా ఆశ్చర్యపోయారు. ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లి, ఖైదీ కడుపులో నుంచి ఫోన్ ను బయటకు తీయించారు. తీహార్ జైలులోని నంబర్-4 సెల్ లో అతను ఉంటాడని, గతంలోనూ జైలు లోపలికి ఫోన్ ను తీసుకువస్తూ అతను దొరికిపోయాడని అధికారులు వెల్లడించారు.