హ్యుమనాయిడ్ రోబోను ఐఎస్ఎస్‌తో అనుసంధానించడంలో రష్యా విఫలం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హ్యుమనాయిడ్ రోబోను ఐఎస్ఎస్‌తో అనుసంధానించడంలో రష్యా విఫలం

  • ఫెడర్ హ్యూమనాయిడ్ రోబోను మోసుకెళ్లిన సోయజ్ అంతరిక్ష నౌక
  • ఆటోమెటిక్ డాకింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య
  • సోమవారం మరోమారు అనుసంధానించనున్న శాస్త్రవేత్తలు
హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన రష్యా సోయజ్ అంతరిక్ష నౌక దానిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు అనుసంధానించడంలో విఫలమైంది. ఐఎస్ఎస్‌లోని సిబ్బందికి సహాయకారిగా ఉండడంతోపాటు దాని నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఫైనల్ ఎక్స్‌పెరిమెంటల్ డెమోన్‌స్ట్రేషన్ ఆబ్జెక్ట్ రీసెర్చ్ (ఫెడర్) రోబోను రెండు వారాల మిషన్‌లో భాగంగా పంపించారు.

శనివారం ఈ రోబో‌ను ఐఎస్ఎస్‌తో అనుసంధానించాలని భావించారు. అయితే ఆటోమెటిక్ డాకింగ్ సిస్టంలో సాంకేతిక సమస్యల కారణంగా రోబో అనుసంధానం కాలేదని నాసా టీవీ పేర్కొన్నట్టు స్థానిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం అంతరిక్ష నౌక స్పేస్ స్టేషన్‌కు 96 మీటర్ల దూరంలో ఉంది. సోమవారం ఉదయం మరోమారు రోబోను ఐఎస్ఎస్‌తో డాకింగ్ చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.

రష్యా తొలిసారి స్కైబోట్ ఎఫ్-850 అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపింది. రోబోనాట్ 2 అనే హ్యూమనాయిడ్ రోబోను 2011లో నాసా అంతరిక్షంలోకి పంపింది. ఇప్పుడు రష్యా మరోసారి మనిషంత పరిమాణంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో ఫెడర్‌ను పంపింది. అయితే, డాకింగ్ చేయడంలో విఫలమైంది. ఐఎస్ఎస్ అనేది అమెరికా, రష్యా, యూరోప్, జపాన్, కెనడా సమష్టి ప్రాజెక్ట్.
Soyuz
spacecraft
Russia
Fedor

More Telugu News