కశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది: పీఓకే నేత మండిపాటు
- దశాబ్దాలుగా అక్కడ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది
- ఉద్యమాలను హైజాక్ చేసింది
- జేకేఎల్ఎఫ్ నేత సర్దార్ సాఘిర్
దేశీయంగా వచ్చిన కశ్మీర్ ఉద్యమాన్ని చెడగొట్టేందుకు 1947లో పస్థూన్ గిరిజనులను ఆ ప్రాంతానికి పాక్ పంపించిందని పేర్కొన్నారు. 1980లో జమ్మూ కశ్మీర్ ప్రజలు మరో ఉద్యమాన్ని తీసుకొస్తే 1989లో పాకిస్థాన్ దానిని హైజాక్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం హిజ్బుల్ ముజాహిదీన్, జమాతుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలను వాడుకుందని సర్దార్ ఆరోపించారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవాలు కూడా కశ్మీర్లోకి ప్రవేశించాయన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చాలా దారుణాలు జరుగుతున్నాయని సర్దార్ సాఘిర్ ఆవేదన వ్యక్తం చేశారు.