అక్క రావడం లేదని.. చెల్లెలితో పాఠాలు చెప్పించిన కాలేజ్!
- మెటర్నిటీ లీవులో అక్క
- ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం
- విచారణకు ఆదేశించిన డీఈఓ
దీంతో అప్పటి నుంచి మాణిక్య కుమారి, అక్క స్థానంలో ఆమె విధులకు హాజరవుతూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం బుధవారం నాడు విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో వారు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ రవీంద్రను నిలదీశారు. డీఈవో ఇంద్రాణి అనుమతితోనే ఈ నియామకం జరిగినట్టు మొదట తెలిపిన ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. డీఈవో వివరణ కోరగా, దీనిపై విచారణకు ఆదేశించామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.