కొత్త నిబంధన: మీ అనుమతి లేనిదే ఇకపై ఎవరూ మీ ఖాతాలో సొమ్ము జమచేయలేరు!
- డబ్బు బట్వాడాకు ఖాతాదారు అనుమతి తప్పనిసరి
- అక్రమ జమలు లేకుండా చూసేందుకే
- రిజర్వ్ బ్యాంక్ ముందు కేంద్రం ప్రతిపాదనలు
అయితే, నోట్ల రద్దు సమయంలో చాలా మంది ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతాల్లో పలువురు తమ నల్ల డబ్బును వేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మరోమారు ఇటువంటివి జరుగకుండా చూసేందుకు ఈ నిబంధన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ, రిజర్వు బ్యాంకును అభిప్రాయం చెప్పాలని కోరింది. ఇక రిజర్వు బ్యాంకు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నిర్ణీత సమయంలోగా బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ కు స్పందిస్తేనే, ఖాతాలో డబ్బు చేరుతుంది. అందుకు కూడా కనీస చార్జ్ ని వసూలు చేయడం ద్వారా బ్యాంకులకు నష్టం కలుగకుండా చూసుకోవాలని కేంద్రం భావిస్తోంది.