శోభన్ బాబుగారు చెప్పారు .. కానీ నేను అంతగా ఆలోచించలేదు: జయసుధ
- శోభన్ బాబుగారు కలుపుగోలుగా వుండేవారు
- డబ్బు జాగ్రత్త చేయడంలో ఆయన తరువాతే
- ఆయనకి ముందుచూపు ఎక్కువన్న జయసుధ
చెన్నై సిటీకి చాలా దూరంగా ఒక ప్రాంతం ఉండేది. సిటీలోని గార్బేజ్ అంతా ఆ ప్రాంతంలోని ఒక ప్రదేశంలో డంప్ చేసేవారు. అలాంటి ప్రాంతంలో శోభన్ బాబు ఇల్లు కట్టుకున్నారు. మరో మూడు నాలుగు ఇళ్లు తప్ప అక్కడ ఏమీ ఉండేవి కావు. భవిష్యత్తులో ఆ డంపింగ్ అక్కడి నుంచి మారిపోతుంది .. ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది .. స్థలాలు కొనుక్కోండి' అని శోభన్ బాబు గారు మాకు చెప్పారు. 'ఈయన ఇక్కడ కొనుక్కోమంటారేంటి' అని మేము అనుకున్నాము. అది ఈ రోజున నెంబర్ వన్ ప్లేస్ .. అదే 'అన్నా నగర్' అని జయసుధ చెప్పుకొచ్చారు.