kalyan Ram: సంక్రాంతి బరిలోకి 'ఎంత మంచివాడవురా'

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, తాజాగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'ఎంత మంచివాడవురా'. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి చిత్రాలు సతీశ్ వేగేశ్న నుంచి వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా 'ఎంత మంచివాడవురా' సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఇది తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
kalyan Ram
Mehreen

More Telugu News