USA: అమెరికాలో తెలుగు వాళ్ల ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయి: సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డల్లాస్ లో తెలుగు ఎన్నారైల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. తన పట్ల తెలుగు వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయని పేర్కొన్నారు. డల్లాస్ లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వినమ్రంగా తెలిపారు. తెలుగు వాళ్లలో కనిపించిన ఉత్సాహం, ఉత్సుకత అమోఘం అని జగన్ తన ట్వీట్ లో వివరించారు. తన పట్ల చూపిన విశేష ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Go Back to Shorts
USA
Jagan
Andhra Pradesh

More Telugu News