నల్లమలలో యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- నల్లమలలో యురేనియం తవ్వకాలకు వస్తే గుండెల్లో గునపం దింపుతానంటూ వార్నింగ్
- తవ్వకాలకు సహకరిస్తున్న నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలంటూ పిలుపు
- యురేనియం తవ్వకాలు జరగడంలేదని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని రేవంత్ డిమాండ్
నల్లమల అడవి బిడ్డలకు తాను అండగా నిలుస్తానని, నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.