పాకిస్థాన్ జర్నలిస్టు ప్రశ్నకు.. యూఎన్ లో భారత ప్రతినిధి ఎలా ప్రతిస్పందించారంటే..!
- పోడియం నుంచి బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన అక్బరుద్దీన్
- పాక్ కు భారత్ ఇప్పటికే స్నేహ హస్తాన్ని చాచిందని వ్యాఖ్య
- టెర్రరిజం అంతమయితేనే చర్చలంటూ స్పష్టీకరణ
'మీకు ఒక విషయం చెబుతున్నా. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా పాకిస్థాన్ కు భారత్ ఇప్పటికే స్నేహ హస్తాన్ని చాచింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం' అని చెబుతూ అక్బరుద్దీన్ తిరిగి పోడియం వద్దకు చేరుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు లేవని, చర్చలు జరిపేందుకు భారత్ ఎందుకు స్పందించడం లేదని పాక్ జర్నలిస్ట్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా... చర్చలు ప్రారంభం కావాలంటే ముందు టెర్రరిజం అంతం కావాలి అని చెప్పారు. కశ్మీర్ లో హింసను ప్రేరేపించేందుకు ఒక దేశంలోని నాయకులు జిహాద్ అనే పదాన్ని వాడుతున్నారంటూ పరోక్షంగా పాక్ పై విమర్శలు గుప్పించారు.