విశాఖలో ప్రభుత్వ ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్!
- కొత్త పాలసీపై కసరత్తు జరుగుతోంది
- రాబోయే రెండ్రోజుల్లో దీన్ని ప్రకటిస్తాం
- విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి
విశాఖపట్నంలోని ముడుసర్ లోవలో ఈరోజు ప్రభుత్వ ఇసుక రీచ్ ను అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెచ్చేవరకూ పాత విధానమే నడుస్తుందని తెలిపారు. ఇసుక పాలసీ విధివిధానాలను రాబోయే రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.