కష్టాల్లో ఉన్న వేళ బంగారు గొలుసిచ్చిన అలీ... తలచుకుని పూరీ జగన్నాథ్ భావోద్వేగం!
- అలీ కోసం పదేళ్ల వయసులో 50 కిలోమీటర్ల ప్రయాణం
- అన్నీ పోగొట్టుకున్న వేళ ధైర్యం చెప్పిన అలీ
- కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వెన్నంటి ఉంటాడన్న పూరీ
తాను వరుస ఫ్లాప్ లను తీసి, ఇల్లు, ఆఫీసులను కూడా పోగొట్టుకున్న వేళ, అలీ, రూ. 3 లక్షల విలువైన బంగారు గొలుసును ఇచ్చాడని, మూడేళ్లలోనే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతావని ధైర్యం చెప్పాడని పూరీ గుర్తు చేసుకున్నాడు. అలీ దీవెనలతో తిరిగి తనకన్నీ లభించాయని అన్నాడు. తనకేదైనా ఫెయిల్యూర్ వస్తే ఓ పెగ్ పోసి, భుజం తట్టి వెళ్లిపోతాడని, హిట్ వస్తే, ఓ బొకేతో వచ్చి హగ్ ఇచ్చి వెళతాడని, కష్టమొచ్చినా, సుఖం వచ్చినా, చెప్పకుండా వచ్చి తోడుగా నిలిచే వ్యక్తి అతనేనని చెప్పాడు.