టెండర్ల రద్దుపై స్పందించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ
- రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది
- ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది
- రివర్స్ టెండరింగ్ తో ఎంత ఖర్చు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేం
‘పోలవరం’పై సమగ్ర నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఈ మేరకు ఆదేశించారు. తుదినిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఈ అంశాలన్నీ పరిగణించాలని, టెండర్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదన్నదే తమ అభిప్రాయమని అథారిటీ పేర్కొంది.