ధన్సిక భలే ఛాన్స్ కొట్టేసింది!
- విజయ్ సేతుపతి తాజా చిత్రంగా 'లాబమ్'
- ఒక కథానాయికగా శ్రుతిహాసన్
- వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల
తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'లాబమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. మరో కథానాయికగా సాయి ధన్సికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.