వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన జగన్

  • 14వ తేదీతో ముగియనున్న నామినేషన్ల గడువు
  • మోపిదేవి, మహ్మద్ ఇక్బాల్, చల్లా పేర్లు ఖరారు 
  • కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం తుది నిర్ణయం తీసుకున్న జగన్
ఎమ్మెల్యే కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో... ఈ మూడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. మరోవైపు, ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు.
Go Back to Shorts
Jagan
MLC
YSRCP

More Telugu News