Mahesh Babu: మహేశ్ బాబు క్రికెట్ నైపుణ్యం... వీడియో ఇదిగో!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రికెట్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. మొన్న వరల్డ్ కప్ జరుగుతుంటే ఇంగ్లాండ్ వెళ్లి అలనాటి క్రికెట్ దిగ్గజాలను కలిసి మురిసిపోయాడు. తాజాగా, మహేశ్ బాబు కశ్మీర్ లోయలో క్రికెట్ ఆడిన తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ టీమ్ తో కలిసి ఆటవిడుపుగా మహేశ్ క్రికెట్ ఆడాడు. డ్రైవ్ షాట్లు, డిఫెన్స్ తో మహేశ్ తన క్రికెట్ స్కిల్స్ ప్రదర్శించడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా, బౌలింగ్ కూడా చేసి బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు.

మహేశ్ తనయుడు గౌతమ్, దర్శకుడు అనిల్ రావిపూడి, ఇతర డైరెక్టర్లు మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి కూడా మహేశ్ ఆడుతుంటే ఫీల్డింగ్ చేశారు. మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ ప్రస్తుతం కశ్మీర్ లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
Go Back to Shorts
Mahesh Babu
Cricket
Tollywood

More Telugu News