తనకు హిందీ మాట్లాడడం రాదని ముందే చెప్పిన ప్రభాస్... అయినా పట్టువదలని ముంబయి మీడియా
Add ap7am to your home Screen

తనకు హిందీ మాట్లాడడం రాదని ముందే చెప్పిన ప్రభాస్... అయినా పట్టువదలని ముంబయి మీడియా

  • ముంబయిలో 'సాహో' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం
  • ప్రభాస్ హిందీలో మాట్లాడాలంటూ ఒత్తిడి చేసిన రిపోర్టర్లు
  • 'జై హింద్' అంటూ బదులిచ్చిన ప్రభాస్
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సాహోతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న రిలీజ్ కానుండగా, తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ముంబయి వెళ్లిన ప్రభాస్ కు అక్కడి మీడియా నుంచి ఒత్తిడి ఎదురైంది. తనకు హిందీలో మాట్లాడడం రాదని ప్రభాస్ ముందే చెప్పినా, మీడియా రిపోర్టర్లు హిందీలో మాట్లాడాలని పదేపదే కోరారు. దాంతో 'జై హింద్' అంటూ పలికి వారిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, ఈ అంశాన్ని అక్కడి మీడియా ఫన్నీగా ప్రచారం చేసింది.

అంతకుముందు ప్రభాస్ మాట్లాడుతూ, తాను హిందీలో రాయడం, చదవడం చేయగలనని, కానీ డైలాగులు చేప్పే స్థాయిలో హిందీ రాదని స్పష్టం చేశాడు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అయితే హిందీలో ఎలాగోలా మేనేజ్ చేయగలనని చెప్పాడు. ఇక, బాలీవుడ్ ఖాన్ హీరోలకు మీ నుంచి పోటీ తప్పదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, "థాంక్యూ మేడమ్... ఇక నేను వెళ్లొచ్చా?" అంటూ సరదాగా సమాధానమిచ్చాడు.
Prabhas
Saaho
Tollywood
Bollywood

More Telugu News