కొన్ని శనిగ్రహాలు అడ్డుపడకపోతే పోలవరం ఇప్పటికే పూర్తయిపోయేది!: బుద్ధా వెంకన్న
- 2014 నాటికి 5 శాతం పనులు కూడా కాలేదు
- మేం వచ్చాక ఏకంగా 70 శాతం ప్రాజెక్టు పూర్తయింది
- మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పండి
- వైసీపీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం
‘‘వెనకటికి ఒకడు.. 'నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నాడంట' సాయిరెడ్డి గారూ ! మంగళవారం చెప్పిన మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు జోలికి పోకుండా ఉత్త కాలువల్లో మట్టితీసి కోట్ల ధనయజ్ఞం చేసినవారి సంగతి అందరికీ తెలిసిందే. మీ బడాయి మాటలు ఎవరూ నమ్మరు’’ అని విమర్శించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.