విడుదలకు ముందే నెట్టింట అజిత్ కొత్త చిత్రం!
- అజిత్ హీరోగా 'నెర్కొండ పార్వై'
- 'పింక్'కు రీమేక్ గా నిర్మించిన బోనీ కపూర్
- రెండురోజుల ముందే నెట్టింట పైరసీ
ఈ షోలకు మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా బాగుందని, అజిత్ నటన సూపరని కితాబులు కూడా వచ్చాయి. ఇదే సమయంలో సినిమాను ఎక్కడ పైరసీ చేశారో తెలియడం లేదుగానీ, నెట్టింట్లోకి వచ్చేసింది. తొలి ప్రీమియర్ షోలు మంగళవారం ఉదయం విదేశాల్లో పడగా, సాయంత్రమే వెబ్ సైట్లలో సినిమా కనిపించింది. దీంతో విడుదలకు రెండు రోజుల ముందే సినిమా పైరసీ అయితే, తమ గతి ఏంటని ఎగ్జిబిటర్ లు వాపోతున్నారు. అజిత్ లాంటి హీరోకే ఈ గతి పడితే, చిన్న చిత్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.