Madhuprakash: మధు ప్రకాశ్ కు ఇంకో నటితో వివాహేతర బంధం: ఆరోపించిన అత్తమామలు

  • ఉరేసుకున్న స్థితిలో మధు భార్య మృతదేహం
  • ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న మధు
  • హత్య చేశాడంటున్న భారతి తల్లిదండ్రులు
మరో నటితో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్న మధు ప్రకాశ్ తమ కుమార్తె భారతిని దారుణంగా హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు పుట్టా లక్ష్మయ్య, తిరుమల ఆరోపించారు. 'కుంకుమపువ్వు' సీరియల్ లో నటిస్తూ మధు పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య భారతి, ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మధు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు.

కుమార్తె మరణంపై స్పందించిన లక్ష్మయ్య, మరో నటి పరిచయం కావడంతో భారతిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడని, రెండేళ్లుగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతూ ఉంటే, వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు కూడా చేశామని అన్నారు. 15 లక్షల రూపాయలు కట్నమిచ్చి, ఘనంగా వివాహం జరిపించామని, భారతికి ఏలోటూ రాకుండా చూసుకుంటాడని భావించామని వాపోయారు.
Madhuprakash
Bharati
Kumkumapuvvu
Serial
Artist
Sucide
Murder

More Telugu News