మృత్యు లోగిళ్లుగా మారిన నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలి!: విజయసాయిరెడ్డి
- హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం
- గతేడాది 79 మంది విద్యార్థులు చనిపోయారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
తాజాగా హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్వాగతించారు. గతేడాది చదువుల ఒత్తిడి కారణంగా 79 మంది విద్యార్థులు చనిపోయారనీ, దీనిపైనే హైకోర్టు స్పందించిందని అన్నారు. మృత్యు లోగిళ్లుగా మారిన ఈ రెండు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.