ఏపీలో చాలా కుటుంబాలు నరకం చూస్తున్నాయి.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి!: చంద్రబాబు
- వరదలు, కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు
- ఏ పాములు ఎటువైపు నుంచి వస్తాయోనని బెదిరిపోతున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘ఒక పక్క వరదలు, మరో పక్క కరెంటు లేదు. ఏ పాములు కొట్టుకొస్తాయో తెలీదు. పిల్లా పాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయి. దయచేసి ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ సామాన్యుడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్న వీడియోను తన ట్వీట్ కు జతచేశారు.