అమర్ నాథ్ యాత్ర మార్గంలో పాక్ కు చెందిన మందుపాతర, స్నిపర్ రైఫిల్ గుర్తింపు
- అమర్ నాథ్ యాత్రను అడ్డుకునేందుకు పాక్ సైన్యం యత్నం
- ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు, ఆయుధాల అప్పగింత
- ఉగ్రదాడులపై హెచ్చరిస్తున్న ఇంటెలిజెన్స్
యాత్ర మార్గంలో మందుపాతరలు, పేలుడు పదార్థాలు, స్నిపర్ రైఫిల్ గుర్తించామని... ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహకారం అందిస్తోందనే విషయం మరోసారి బయటపడిందని ధిల్లాన్ చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అమర్ నాథ్ యాత్రపై పంజా విసిరేందుకు పాక్ సైన్యం యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రశాంతంగా కొనసాగుతున్న యాత్రను అడ్డుకునే ఎలాంటి ప్రయత్నాన్నీ కూడా తాము సహించబోమని అన్నారు.