TTD: ఈ ఉదయం పది గంటల నుంచి అందుబాటులో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈ ఉదయం పది గంటల నుంచి ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా  తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. నవంబరు నెలకు సంబంధించి  సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను అందుబాటులో వుంచనున్నట్టు పేర్కొంది.

టికెట్లు బుక్  చేసుకున్న భక్తులను ఎలక్ట్రానిక్‌ లాటరీ (డిప్‌) విధానంలో ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. అయితే,  విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను మాత్రం కరెంటు బుకింగ్‌ కింద వెంటనే నమోదు చేసుకోవచ్చని వివరించారు. కాగా, నవంబరు నెలకు గాను అన్ని టికెట్లు కలిపి 60 వేల వరకు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
TTD
Tirumala
Tirupati

More Telugu News