నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన సెర్బియా పోలీసులు

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బెల్ గ్రేడ్ లో ఆయనను అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నారు. వాన్ పిక్ వాటాల విషయంలో రస్ అల్ ఖైమాకు, నిమ్మగడ్డకు విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. సెర్బియాకు విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Nimmagadda Prasad
Serbia
Police
Arrest
VANPIC
YSRCP

More Telugu News