రహస్యంగా పెళ్లాడిన నటి రాఖీ సావంత్.. అదేం లేదన్న వివాదాస్పద నటి

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఎన్నారైని పెళ్లాడినట్టు జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాఖీ పెళ్లికుమార్తె డ్రెస్‌లో ఉన్న ఫొటోలను కూడా ప్రచురించాయి. అయితే, వార్తలు బయటకు రాగానే రాఖీ అగ్గిమీద గుగ్గిలమైంది. తనకు పెళ్లి కాలేదని, అవి జేడబ్యూ మారియట్‌ హోటల్‌లో బ్రైడల్ ఫొటో షూట్‌లో భాగంగా తీసిన ఫొటోలని క్లారిటీ ఇచ్చింది.

తాను ఎవరితోనూ లవ్‌లో పడలేదని, సింగిల్‌గానే ఉన్నానని పేర్కొన్న రాఖీ.. తనకు పెళ్లైపోయిందని జనం ఎందుకనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ పోటీదారు దీపక్ కలాల్‌ను లాస్ ఏంజెలెస్‌లో పెళ్లాడబోతున్నట్టు రాఖీ ప్రకటించి షాక్‌కు గురిచేసింది. అయితే, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించి మరో షాకిచ్చింది.
Go Back to Shorts
Rakhi Sawant
Bollywood
Marriage
Actress

More Telugu News