Chandrababu: మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మరణంపై చంద్రబాబు స్పందన

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ముఖేశ్ గౌడ్ గారి మరణం విచారకరం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు. తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రజా ప్రస్థానంలో బీసీల అభివృద్ధి కోసం ముఖేశ్ గౌడ్ ఎంతగానో శ్రమించారని తెలిపారు. ముఖేశ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Mukhesh Goud
Telangana

More Telugu News