దేశంలో ఏ దరిద్రం జరిగినా మీ ఇద్దరి పేర్లే బయటకొస్తాయి.. విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్!
Add ap7am to your home Screen

దేశంలో ఏ దరిద్రం జరిగినా మీ ఇద్దరి పేర్లే బయటకొస్తాయి.. విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్!

  • చంద్రబాబుపై సాయిరెడ్డి విమర్శలు
  • సాన సతీశ్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
  • విజయసాయిరెడ్డి మనీలాండరింగ్ కింగ్ అన్న బుద్ధా
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దళారి సతీశ్ సానతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయనీ, చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ వేశారు. విజయసాయిరెడ్డి ఓ మనీలాండరింగ్ కింగ్ అని బుద్ధా వెంకన్న విమర్శించారు.

సాన సతీశ్ లాంటి వ్యక్తితో విజయసాయిరెడ్డికే ఎక్కువ పని ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ దరిద్రం జరిగినా నువ్వు, నీ బాస్(జగన్) ఉంటారనేది దేశ ప్రజలంతా చాలా సార్లు చూశారని ఎద్దేవా చేశారు. టైటానియం కేసులో అమెరికా అధికారుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మీ ఆత్మ(కేవీపీ రామచంద్రరావు) సిద్ధంగా ఉన్నారనీ, ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూరి అది ఆపే ప్రయత్నం చేయాలని చురకలు అంటించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Jagan
Telugudesam
Chandrababu
budda venkanna
budha venkanna

More Telugu News