Andhra Pradesh: అవినీతిని చంద్రబాబు వ్యవస్థీకృతం చేశారు.. కొన్ని సెలక్టెడ్ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు!: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. తన హయాంలో కొన్ని సెలక్టెడ్ కంపెనీలకు చంద్రబాబు అయాచిత లబ్ధి చేకూర్చారని వ్యాఖ్యానించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అలా వ్యవహరించబోదని స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో ఏపికీ అవినీతి రాష్ట్రం అనే ముద్ర పడిందన్నారు. ఏపీ మౌలికవసతులు (జ్యుడీషియల్ ప్రివ్యూతో పారదర్శకత) బిల్లు-2019తో ఏపీకి పడ్డ ఈ అవినీతి ముద్ర తొలగిపోతుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
Corruption

More Telugu News