Vijayawada: విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిన ఏపీ మంత్రి వెల్లంపల్లి భార్య శ్రీవాణి

షార్ట్స్‌లో చూడండి
అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భార్య శ్రీవాణి అన్నారు. వెల్లంపల్లి సాయి అవనిష్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసింది. విజయవాడలోని గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్న ఎన్.ఎస్.ఎన్ ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, విద్యతో ఉన్నత అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉర్దూ పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 
Go Back to Shorts
Vijayawada
minister
Vellampalli
wife
srivani

More Telugu News