పీపీఏల వ్యవహారం.. విద్యుత్ కంపెనీల పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
- ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోపై సవాల్
- కాంపిటీటివ్ బిడ్డింగ్ లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నాం
- ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తర్వాతే ఒప్పందాలు
ఈ విషయమై విద్యుత్ కంపెనీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ విద్యుత్ సంస్థలు ఓ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. కాంపిటీటివ్ బిడ్డింగ్ లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నామని, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తర్వాతే డిస్కంలతో ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నాయి. చెల్లించిన బిల్లులు సైతం మళ్లీ సమీక్షించాలని జీవో జారీ చేయడం, పీపీఏల వ్యవహారంలో ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమని కంపెనీల తరపు న్యాయవాది తన వాదన వినిపించారు.